మాచర్ల అలుగురాజుపల్లి, సెప్టెంబర్ 04, 2026
అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
ప్రధానంగా ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, సందడిగా ఉట్టి కొట్టి శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. విద్యార్ధుల ఉత్సాహం, కేరింతలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జున్నా శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ జున్నా చక్రధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. ఎస్. నరసింహారావు, వైస్ ప్రిన్సిపాల్ బి. నరసింహారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాసిం వివిధ విభాగాల హెచ్ఒడి లు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కళాశాలలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందుతుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
Be the first to share your thoughts on this story!