Tuesday, 20 October 2026
Header1
BREAKING

పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు -ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 27 Sep 2026, 04:51 PM
🔄 నవీకరణ: 17 Oct 2026, 04:39 PM
👁️ 118 views


మాచర్ల.
రాజధాని వాయిస్:

మాచర్ల పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనున్నమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం పట్టణ పరిధిలోని 11,12,13,14వ వార్డుల నందు సుడిగాలి పర్యటన చేశారు. రోప్ లైన్, ఎస్సి, చెంచు,గౌడ, ఎర్రగడ్డ, విశ్వబ్రాహ్మణ కాలనీలలో పర్యటించి, స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Image 2026-09-27 at 4.43.56 PM.jpeg
అనంతరం వార్డుల నందు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. విశ్వబ్రాహ్మణ ఖాళీలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గన్నోజు శంకరాచారి, బాలకృష్ణ చారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కజ్జం సైదయ్య, మద్దిగపు చిన వెంకటరామిరెడ్డి, యెనుముల కేశవరెడ్డి, కొమెర దుర్గారావు, కంభంపాటి అనిల్ కుమార్, శశిరెడ్డి, షేక్ జానీ, చెన్నకేశవులు,భవాని శంకర్, జంధ్యాల సత్యనారాయణ, వేముల గంగమ్మ, శంకర్ నాయక్, మల్లెల శివ శంకర్, డేవిడ్ చెన్నయ్య, గడ్డం అంజి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X