Tuesday, 20 October 2026
Header1
BREAKING

12న కే.సీ.పీ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 09 Sep 2026, 05:03 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 50 views

మాచర్ల సెప్టెంబర్ 09 రాజధాని వాయిస్:

కే.సీ.పీ సంస్థల చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెలగపూడి ఇందిరాదత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ఉచిత క్యాన్సర్ అవగాహన, వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కే.సీ.పీ సీనియర్ జనరల్ మేనేజర్ వి. వెంకటరమణ తెలిపారు.

కే.సీ.పీ జనరల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలి, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల వ్యాధులు మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కే.సీ.పీ జనరల్ స్టోర్ పక్కన ఉన్న వెలగపూడి లక్ష్మణ దత్ ఆడిటోరియంలో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

నందమూరి బసవతారకం–ఇండో అమెరికన్ క్యాన్సర్ సంస్థకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులచే మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఉదరం, రొమ్ము, ఛాతీ, గర్భాశయం సంబంధిత పరీక్షలతో పాటు అవసరమైన వైద్య సలహాలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, పాప్ స్మియర్, మెమోగ్రఫీ వంటి ఖరీదైన పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల వారు సహకారం అందిస్తున్నారని తెలిపారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. శిబిరానికి హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని వెంట తీసుకురావాలని సూచించారు.

సమావేశంలో కే.సీ.పీ హెచ్‌ఆర్ ఉదయ్ కుమార్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ సభ్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల అధ్యక్షులు పఠాన్ నాగూర్ వలి, ట్రెజరర్ ఆవుల వెంకట వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X