Tuesday, 20 October 2026
Header1
BREAKING

పోలీస్ స్టేషన్లలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 03 Oct 2026, 10:19 PM
🔄 నవీకరణ: 08 Oct 2026, 09:27 PM
👁️ 139 views

నరసరావు పేట అక్టోబర్ 03 రాజధాని వాయిస్ :

రానున్న ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఐపీఎస్ శనివారం బండ్లమోటు, ఈపూరు, వినుకొండ టౌన్, ఐనవోలు, శావల్యాపురం పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
WhatsApp Image 2026-10-03 at 10.10.56 PM (1).jpeg
తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ భవనాలతో పాటు పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, అనంతరం స్టేషన్లలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేసుల నమోదు వివరాలు, ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుంటూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు భద్రతా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.
పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగేలా సేవలు అందించాలని సూచించారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగించే చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో క్షేత్రస్థాయి సమాచారాన్ని నిరంతరం సేకరిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతురావు, వినుకొండ టౌన్ సీఐ ప్రభాకర్, వినుకొండ రూరల్ సర్కిల్ సీఐ బ్రహ్మయ్య, బండ్లమోటు ఎస్సై షమీర్ భాషా, ఈపూరు ఎస్సై వేణుగోపాల్, ఐనవోలు ఎస్సై కృష్ణారావు, శావల్యాపురం ఎస్సై వెంకటేష్ బాబులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X