Tuesday, 20 October 2026
Header1
BREAKING

శివప్రసాద్ సేవలు చిరస్మరణీయం

- నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 అమరావతి
📅 ప్రచురణ: 21 Sep 2026, 11:05 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 161 views

అమరావతి:

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బాల్య మిత్రుడు, మాజీ మంత్రి మరియు మాజీ ఎంపీ అయిన స్వర్గీయ నారమల్లి శివప్రసాద్ కి ఘన నివాళులు అర్పించారు.
నేడు శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా, చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయన్ని గుర్తు చేసుకున్నారు. "నా బాల్య మిత్రుడు, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించిన తెలుగుదేశం నేత, సినీ నాటక కళాకారుడు, దర్శకుడు నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, కళారంగంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి," అని చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాజకీయ రంగంలోనే కాకుండా కళా రంగంలోనూ రాణించిన శివప్రసాద్, ముఖ్యంగా పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై పోరాడే సమయంలో వేసిన వివిధ రకాల వేషాలు మరియు ఆయన నిరసనలు అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. శివప్రసాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X