Tuesday, 20 October 2026
Header1
BREAKING

శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి హుండీ ఆదాయం రూ.60.50 లక్షలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 17 Sep 2026, 11:01 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 207 views

దుర్గి.

సెప్టెంబర్ 17
రాజధాని వాయిస్ :

​శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపుల హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, కోటప్పకొండ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో దేవస్థాన సిబ్బంది, భక్తులు కలిసి ఈ లెక్కింపును పూర్తి చేశారు. గత 84 రోజులకు గాను అమ్మవారి హుండీ ద్వారా మొత్తం రూ. 60,50,416/- (అరవై లక్షల యాభై వేల నాలుగు వందల పదహారు రూపాయలు) ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కాకర్ల ఆదిశేష నాయుడు మీడియాకు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పటిష్టమైన నిఘా నడుమ సాగిందని తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X