Tuesday, 20 October 2026
Header1
BREAKING

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు...

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 04:52 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 14 views

పలు డివిజన్లలోని శ్రీకృష్ణ ఆలయాల్లో పాల్గొన్న బొండా ఉమా 

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. సెప్టెంబర్ 04

 శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27, 29, 31, 57, 59, 60 డివిజన్లలోని శ్రీకృష్ణ దేవాలయాల్లో శుక్రవారం నిర్వహించిన జన్మాష్టమి వేడుకల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు బొండా ఉమా కి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ, ముందుగా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తులు భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నారని, భారతదేశంలో ప్రతి ఇంటా శ్రీకృష్ణ పరమాత్మునికి పూజలు, భజనలు నిర్వహిస్తూ ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు.శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా అందించిన సందేశాలు, బోధనలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తాయని బొండా ఉమా అన్నారు. ధర్మాన్ని ఆచరించడం, సత్యం, న్యాయం, మంచితనం వైపు నడవడం, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించడం వంటి విలువలను భగవద్గీత మనకు బోధిస్తుందని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి బోధనలను మన జీవితాల్లో ఆచరిస్తూ మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని బొండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు, ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X