కారంపూడి సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్:
కారంపూడి సబ్ స్టేషన్ లో నూతన 33 కేవీ పీడర్ ను పల్నాడు జిల్లా ఎస్ సి పి. ప్రత్తిపాటి విజయకుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కారంపూడి సబ్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన 33 కెవి ఫీడర్ ద్వారా అధికలోడును తగ్గిస్తూ.. మిగతా పిడర్ కు భారం తగ్గిస్తుందని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాల విద్యుత్ సరఫరా నాణ్యత మరియు విశ్వనీయత మరింత మెరుగుపడుతుందన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. విద్యుత్ వినియోగదారులు అందరూ క్రమం తప్పకుండా ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లించి .. విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. మాచర్ల డిఈ సింగరయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆనందరావు , సిబ్బంది తదితరులు పాలుగోన్నారు.
Be the first to share your thoughts on this story!