మాచర్ల అక్టోబర్ 10 రాజధాని వాయిస్ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన, నిబంధనలకు అనుగుణంగా
న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను
స్వాగతిస్తున్నామని మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు
తెలిపారు. రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే
దిశగా కేటాయింపులు చేపట్టడం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు
లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం బీసీలకు తగిన న్యాయం చేయలేదని విమర్శించిన కొమెర దుర్గారావు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశాలు కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయానికి బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
బీసీలకు సముచిత అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కొమెర దుర్గారావు కోరారు.
Be the first to share your thoughts on this story!