Tuesday, 20 October 2026
Header1
BREAKING

అతిపెద్ద ఉద్యానవన క్షేత్రంగా రాయలసీమ..

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 01 Oct 2026, 01:36 PM
🔄 నవీకరణ: 04 Oct 2026, 06:03 AM
👁️ 3 views


 
* అక్టోబర్ 2న రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్ ఏర్పాటు

* సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ పవన్ చేతుల మీదుగా శ్రీకారం 

* మారనున్న రాయలసీమ రూపు రేఖలు

* రూ.26 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి

* రోడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన

* కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు :

 మంత్రి సవిత

*పెనుకొండ/శ్రీసత్యసాయి :* రూ.లక్ష కోట్లతో ప్రారంభించనున్న హార్టీకల్చర్ హబ్ తో దేశంలోనే రాయలసీమ అతిపెద్ద ఉద్యానవన క్షేత్రంగా మారబోతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆనందం వెలిబుచ్చారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శుక్రవారం శ్రీకారం చుడుతున్నామన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గ్లోబర్ హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ఒకప్పుడు రాళ్లసీమ మారిన రాయలసీమ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో సస్యశ్యామలంగా మారుతోందన్నారు. ఇప్పటికే రాయసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారన్నారు. ఇపుడు రూ.లక్ష కోట్లతో రాయలసీమలో హార్టీకల్చర్ హబ్ ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో వాణిజ్య పంటలు సాగుకు పెద్ద ఎత్తున అవకాశం కలుగుతుందన్నారు. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో రాయలసీమ దేశంలో అతిపెద్ద వ్యవసాయ క్షేత్రంగా ఆవిర్భవించనుందని మంత్రి సవిత తెలిపారు.

*రూ.26 వేల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల పూర్తి*

హార్టీకల్చర్ హబ్ ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల పరిధిలోని 201 క్లస్టర్లలో వినూత్న పంటల సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 14.41 లక్షల హెక్టార్లకు ఉద్యానవన సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పెంచేలా మైక్రో ఇరిగేషన్ కు మరింతపెద్ద పీట వేస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సాగునీటి రంగానికి రూ. 26 వేల కోట్లను వెచ్చిస్తున్నామని, ఈ నిధులతో రాయలసీమలోని 52 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయనున్నామని తెలిపారు. పంట నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా పంట వృథాను అరికట్టడమే కాకుండా, రైతులకు ఆర్థిక మేలు కలుగుతుందన్నారు. 

*రాయలసీమకు సాగు, తాగునీరిచ్చిన ఘనత చంద్రబాబుదే..*

అయిదేళ్ల ఏళ్ల జగన్ పాలనలో రాయలసీమకు, ఈ ప్రాంత రైతంగానికి చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత అన్న ఎన్టీఆర్ ది, సీఎం చంద్రబాబుదేనన్నారు. మడకశిరకు, కుప్పానికి, పులివెందులకు కృష్ణా జలాలు అందించన ఘనత సీఎం చంద్రబాబునాయుడిదేనన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తామని మంత్రి సవిత తెలిపారు. 

*నేడు(అక్టోబర్ 2న) హార్టీకల్చర్ హబ్ కు శ్రీకారం*

రాయలసీమలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను కూటమి ప్రభుత్వం ఏర్పటు చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా మదనపల్లెలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా హార్టీకల్చర్ హబ్ కు శ్రీకారం చుడుతున్నామన్నారు. రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్ ఏర్పాటుతో రాయలసీమ రూపు రేఖలే మారిపోతాయన్నారు. రాళ్ల సీమను రతనాల సీమగా మారుస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. 

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X