మాచర్ల:
భారతదేశం గర్వించతగ్గ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశంసించారు. నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పార్క్ సెంటర్ నందు కూటమి పార్టీల శ్రేణులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భారీ కేక్ ను కట్ చేసి.., మోదీజీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్న జై జవాన్.. జై కిషాన్ అనే నినాదానికి జై వైజ్ఞానిక్ అని జోడించి, ప్రపంచానికే విజ్ఞానం అందించే స్ధాయికి భారత్ ను మోదీ నిలబెట్టారని చెప్పుకొచ్చారు. ఆర్ధిక వ్యవస్ధ సుస్ధిరతకు అనేక సంస్కరణలు తీసుకొచ్చి.., పొరుగు దేశాలతో మిత్రుత్వాన్ని నడుపుతూ గొప్ప దౌత్యవెత్తగా తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు నాయకులు కాశీపతి, క్రాంతికుమార్, యెనుముల కేశవరెడ్డి, రాజబోయిన మధు, కొమెర దుర్గారావు, కంభంపాటి అనిల్ కుమార్,శాంతి, బొగ్గవరపు మస్తాన్ రావు, మారం వంశీకృష్ణ, నాగారాజు, శివ కోటయ్య నాయక్,యేచూరి సురేష్, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!