కాకినాడ రూరల్:-
రాజధాని వాయిస్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని కోరుతూ పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న తమకు మరిన్ని అవకాశాలు కల్పించాలని వారు మంత్రిని కోరారు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగానే పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించామని చెప్పారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి, వారికి బంగారు భవిష్యత్ అందించడమే తమ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Be the first to share your thoughts on this story!