శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం నరసరావుపేటలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ:26 Sep 2026, 12:29 PM
🔄 నవీకరణ:01 Oct 2026, 12:58 PM
👁️ 131 views
నరసరావుపేట. సెప్టెంబర్ 26 రాజధాని వాయిస్ :
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక శక్తుల నిర్మూలన లక్ష్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు నరసరావుపేట 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 25వ వార్డు పెద్దచెరువు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వార్డులోని రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిపారు. అనంతరం పాత నేరస్థులతో సమావేశమై, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు వార్డులో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో సమావేశమై ‘ప్రజలకు మేమున్నాము’ అనే భరోసా కల్పించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని, మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పించారు. వార్డులో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అకారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో నరసరావుపేట 2-టౌన్ సీఐ ప్రభాకర్, నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు, చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్యలతో పాటు సబ్-డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం నరసరావుపేటలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
నరసరావుపేట. సెప్టెంబర్ 26 రాజధాని వాయిస్ :శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక శక్తుల నిర్మూలన లక్ష్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు నరసరావుపేట 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 25వ వార్డు పెద్దచెరువు ప్రాంతంలో ...
నరసరావుపేట. సెప్టెంబర్ 26 రాజధాని వాయిస్ :
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక శక్తుల నిర్మూలన లక్ష్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు నరసరావుపేట 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 25వ వార్డు పెద్దచెరువు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వార్డులోని రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు జరిపారు. అనంతరం పాత నేరస్థులతో సమావేశమై, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీసులు వార్డులో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో సమావేశమై ‘ప్రజలకు మేమున్నాము’ అనే భరోసా కల్పించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని, మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని అవగాహన కల్పించారు. వార్డులో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అకారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో నరసరావుపేట 2-టౌన్ సీఐ ప్రభాకర్, నరసరావుపేట రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావు, చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్యలతో పాటు సబ్-డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!