వినుకొండ సెప్టెంబర్ 04
వినుకొండ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు.నాగార్జునసాగర్ జలాలతో నిండుతున్న సింగర చెరువును శుక్రవారం ఆయన పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటికీ రోజూ సురక్షిత నీరు ఇవ్వడమే తమ లక్ష్యమని, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడి ప్రత్యేకంగా సాగర్ నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని తాగునీటి చెరువులను నింపి ప్రజలతో పాటు పశువుల దాహార్తిని తీరుస్తామన్నారు. శాశ్వత తాగునీటి పథకం పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు , కూటమి నాయకులు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!