Tuesday, 20 October 2026
Header1
BREAKING

50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 19 Sep 2026, 04:08 PM
🔄 నవీకరణ: 25 Sep 2026, 11:48 AM
👁️ 541 views
Story Highlights
* నూతన పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనలో చేతివాటానికి తావివ్వొద్దు
* చేనేతల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
* అర్హుందరికీ పెన్షన్లు ఇస్తాం.. ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వొద్దు
* నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం
* కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చితే సహించేది లేదు
* అక్రమ వసూళ్లకు పాల్పడిన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగుల
పెనుగొండ. 
సెప్టెంబర్ 19 
రాజధాని వాయిస్ :

రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేతలందరికీ పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. పెనుకొండ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, కొత్తగా అందిన 16,521 దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ఇప్పటికే 84 వేల మందికి పైగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే నేరుగా పింఛన్ మంజూరు చేస్తుందని, దరఖాస్తుల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇదే సమయంలో శ్రీసత్యసాయి జిల్లాలో దరఖాస్తుల పరిశీలన పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో, డీవో రమణారెడ్డి, ఏడీవో శీనా నాయక్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించగా, కమిషనర్ రేఖారాణి వారిని సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మంత్రి సవిత హెచ్చరించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X