డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
అమరావతి. సెప్టెంబర్ 02
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ అభిమానులకు తిరుగులేని పవర్ స్టార్‌గా, జనసైనికులను నడిపించే సేనానిగా, వ్యక్తిగతంగా తనకు దేవుడిచ్చిన అన్నయ్యగా పవన్ కళ్యాణ్ నిలిచారని లోకేష్ కొనియాడారు. పవనన్న నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలు, ఆనందాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుతూ, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులు, జనసైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!