Tuesday, 20 October 2026
Header1
BREAKING

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 09 Oct 2026, 04:31 PM
🔄 నవీకరణ: 15 Oct 2026, 07:01 PM
👁️ 266 views

​నరసరావుపేట.

అక్టోబర్ 09: రాజధాని వాయిస్ :

రోడ్డు ప్రమాదంలో గాయపడిన దుర్గి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జె. నరసింహారావును (HC 577) పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ పరామర్శించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే నరసరావుపేటలోని గజ్జల బ్రహ్మారెడ్డి ఆసుపత్రికి చేరుకున్న ఎస్పీ, అక్కడ చికిత్స పొందుతున్న నరసింహారావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పాటు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఎస్పీ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X