నరసరావు పేట :
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదహళ్లి, ఐపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పల్నాడు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణం లోని పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ రకాల ఆయుధాలు, అడ్వాన్స్డ్ వెపన్స్, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ వెపన్స్, హానికరం కాని ఆయుధాలు, గుంపులను చెదరగొట్టేందుకు వినియోగించే స్మోక్ గన్స్, డ్రోన్ కెమెరాల పనితీరును విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఆయుధాలను దగ్గరగా పరిశీలించి, కొన్నింటిని స్వయంగా చేతితో పట్టుకుని ఆసక్తి కనబరిచారు.
అలాగే బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ పరికరాలు, ట్రాఫిక్ పోలీసుల పరికరాలు, హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, రక్షణ హెల్మెట్లు, లాఠీలు, రైట్ గేర్ పరికరాలు, వజ్ర వాహనం, మహిళా పోలీస్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు వాహనం, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్, రక్షక్ వాహనాలను ప్రదర్శించి, వాటి వినియోగం, విధుల నిర్వహణలో వాటి ప్రాధాన్యతను వివరించారు. పోలీసు శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ట్రాఫిక్ లో నిత్యం ఉపయోగించే వాకీటాకీలు, వి ఎచ్ ఎఫ్ సెట్స్ మొదలగు కమ్యూనికేషన్ పరికరాలు, వివిధ విభాగాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి IPS ,, AR డీఎస్పీ గాంధీ రెడ్డి , ఫింగర్ ప్రింట్ యూనిట్ ఇనస్పెక్టర్ B. పణి , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు S. కృష్ణ, గోపీనాథ్ గారు, యువ రాజు , ఆర్ ఎస్సైలు, , పోలీసు సిబ్బంది, సుమారు 950 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!