Tuesday, 20 October 2026
Header1
BREAKING

నశాముక్త యువ – వికసిత్ భారత్ కోసం యువత సంకల్పం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 గుంటూరు
📅 ప్రచురణ: 20 Sep 2026, 05:40 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 115 views

గుంటూరు, సెప్టెంబర్ 20: రాజధాని వాయిస్ :

నశాముక్త యువ – వికసిత్ భారత్ 100 వారాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ్ కార్యక్రమాన్ని గుంటూరులోని ప్రభత్వ మహిళా కళాశాల లో నిర్వహించారు. మేరా యువ భారత్, గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పాల్గొని నషా ముక్త సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని సంకల్పం చేశారు. నషా పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని, తోటి యువతను కూడా చైతన్యపరచాలని కార్యక్రమంలో అవగాహన కల్పించారు.

WhatsApp Image 2026-09-20 at 5.35.26 PM.jpeg

ఈ సందర్భంగా మేరా యువ భారత్, గుంటూరు డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ, నషా ముక్త యువతే దేశ ప్రగతికి కీలక శక్తి అని పేర్కొన్నారు. యువతలో ఆరోగ్యం, ఫిట్‌నెస్, నషా ముక్త జీవనం మరియు జీవన నైపుణ్యాలపై అవగాహన పెంపొందించడమే ఈ 100 వారాల కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యం, క్రీడలు, సానుకూల ఆలోచనలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
WhatsApp Image 2026-09-20 at 5.35.26 PM (2).jpeg

ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎం. సంతోష్ కుమారి, మాట్లాడుతూ విద్యార్థులు నశా పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు సమాజంలో నషా ముక్త జీవన విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో యువత నషా ముక్త ప్రతిజ్ఞ చేయడంతో పాటు సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. నషా ముక్త భారత నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచే విధంగా చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X