పల్నాడు నూతన ఎస్పీని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
దళిత, గిరిజనులపై దాడులను అరికట్టాలని వినతి
నరసరావుపేట.సెప్టెంబర్ 30,రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి షాలేం రాజ్ మాదిగ సలహా మేరకు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు నూతన జిల్లా ఎస్పీ జగదీష్ హదహళ్ళి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ నాయకుల అండదండలతో కొందరు భూస్వాములు, పెత్తందార్లు దళిత, గిరిజన వర్గాలపై వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్నారని, దళిత, గిరిజన ఉద్యోగులపై జరుగుతున్న పరోక్ష దాడులు చేసేవాళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాయకుల వినతిపై ఎస్పీ తక్షణమే సానుకూలంగా స్పందించారు. కుల, మతాలకు అతీతంగా చట్టం ముందు అందరూ సమానమేనని, భవిష్యత్తులో దళిత, గిరిజనులపై ఇటువంటి దాడులు, వివక్షాపూరిత ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పచ్చిగోళ్ళ సుధాకర్ మాదిగ, నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు తాళ్లూరి దేవదానం మాదిగ, వినుకొండ సీనియర్ నాయకులు మాసిపోగు మరియా బాబు మాదిగ, యువసేన అధ్యక్షులు గుండాల ప్రభుదాస్ మాదిగ, నరసరావుపేట మండల అధ్యక్షులు వేసేపోగు తిమోతి మాదిగ, రొంపిచర్ల మండల అధ్యక్షులు మేలింగి శ్యాంబాబు మాదిగ, బీఎస్పీ నాయకులు వేల్పుల రాంబాబు, కొండమోది కోటి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!