మంగళగిరి: రాజధాని వాయిస్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే ఎం.పీ.టీ.సీ. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మంగళగిరి–తెనాలి ఫ్లైఓవర్ సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో APMSIDC ఛైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులు చిల్లపల్లి శ్రీనివాసరావు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
దుగ్గిరాల మండలంలో జరగనున్న ఎం.పీ.టీ.సీ. ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్న స్థానాలకు సంబంధించి కమిటీ సభ్యులు అభ్యర్థుల జాబితాలను చిల్లపల్లి శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న సంబంధాలు, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
అభ్యర్థులకు సంబంధించిన వివరాలను జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో గుంటూరు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యురాలు బడే కోమలి, గుంటూరు పార్లమెంట్ నిర్వాహక్ దళ్ కమిటీ సభ్యుడు పర్వతం మధుసూదన్ రావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు గంజి చిరంజీవి, కోటేష్ బాబు, మునగపాటి వెంకట మారుతీరావు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!