గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్-2లో శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక ఉత్సవాల్లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ నిర్వాహకులతో మాట్లాడారు.
అనంతరం గుంటూరు శ్రీనివాసరావుపేట 9వ లైన్, 11వ లైన్ ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు హాజరై ప్రారంభించారు.
అదే విధంగా నియోజకవర్గ పరిధిలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పర్యావరణ హితమైన మట్టి వినాయకులను ప్రోత్సహించాలని, ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో పాటు సామాజిక బాధ్యతతో నిర్వహించాలని సూచించారు.
Be the first to share your thoughts on this story!