Tuesday, 20 October 2026
Header1
BREAKING

కేరళలోని అమృతపురి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 04:39 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 5 views
మాతా అమృతానందమయి దేవితో భేటీ

అమృతపురి(కొల్లం)
సెప్టెంబర్ 04

కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ముందుగా అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ దేవాలయాన్ని, కలరిని మంత్రి సందర్శించారు. అనంతరం శ్రీ మాతా అమృతానందమయి దేవితో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మాతా అమృతానందమయి దేవి ఆశీస్సులు పొందారు. అనంతరం అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్ ను, అమృత ఆయుర్వేద కళాశాలను మంత్రి సందర్శించారు. దాదాపు మూడు గంటలపాటు ఆశ్రమంలో గడిపారు. 

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X