- బాపట్ల మండలంలో విద్యుత్ వైర్ తగలి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన పైదిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి
- నర్సీపట్నం నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి
- ఇదే ఘటనలో గాయాలపాలైన నాగరాజును మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి
- ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి గొట్టిపాటి హామీ
- రెండు ప్రమాద ఘటనలకు గల కారణాలు అధికారుల్ని అడిగి తెలుసుకున్న మంత్రి
- ఎల్‌టీ విద్యుత్ లైన్ తెగి నేలవైపు వేలాడుతుండటాన్ని గమనించక దానిని తాకడంతో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు అధికారాలు వెల్లడి
- వాయుగుండం కారణంగా ఎక్కడైనా విద్యుత్ స్తoభాలు పడినా, వైర్లు తెగినా ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశం
- ప్రజలు కూడా వెంటనే సమీప కార్యాలయానికి ఫిర్యాదు చేసేలా సమాచార వ్యవస్థ పటిష్టం చేయాలన్న మంత్రి
- ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాలు నివారించాలన్న మంత్రి
- ఘటనలు పునరావృతం కాకూడదని స్పష్టం చేసిన మంత్రి
- ఉత్తరాంధ్ర ఈదురుగాలులు, వర్షాల వల్ల తాజా పరిస్థితి పై ఆరా తీసిన మంత్రి
- పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడితే కొన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరఫరా నిలిపినట్లు తెలిపిన అధికారులు
- ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 70-80కి.మీ మేర గాలులు వీస్తున్నoదున సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని వివరించిన అధికారులు
- వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా ను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని మంత్రి ఆదేశం
- ఎస్పీడీసీఎల్ నుంచి అదనవు సిబ్బంది ని, మెటీరియల్ కూడా ఉత్తరాదికి పంపినట్లు తెలిపిన గొట్టిపాటి
- సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ అన్ని చోట్ల శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసిం మంత్రి
- ఎక్కడా ప్రాణ నష్టం వాటిళ్లకుoడా అధికారులు విధి నిర్వహణ లో బాధ్యత గా ఉండాలని మంత్రి దిశానిర్దేశం
Tuesday, 20 October 2026
www.rajadhanivoice.in
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష
📰
Official Article Source Link
https://www.rajadhanivoice.in/post/minister-gottipati-ravi-review-with-senior-officials-of-power-department