ఉపాధ్యాయులపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం
మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి.రాజధాని వాయిస్:
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువులపై రౌడీ మూకలతో దాడులు చేయించడం అత్యంత దారుణమని, ఇలాంటి అరాచక చర్యలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.
అధికారం ఉన్నా లేకపోయినా దాడుల సంస్కృతిని కొనసాగించడం వైసీపీకి అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించి నిరుద్యోగుల కోసం డీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపట్టడాన్ని చూసి ఓర్వలేకనే ఈ దుశ్చర్యలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. మొదటి నుంచీ ఉపాధ్యాయులంటే జగన్‌కు గిట్టదని, అందుకే గత పాలనలో వారిని మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని, ఇప్పుడు అధికారం కోల్పోయాక ఏకంగా దాడులు చేయిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Be the first to share your thoughts on this story!