Tuesday, 20 October 2026
Header1
BREAKING

జనసేన పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ

- పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 14 Oct 2026, 09:51 PM
🔄 నవీకరణ: 17 Oct 2026, 08:55 AM
👁️ 42 views

మంగళగిరి అక్టోబర్ 14 రాజధాని వాయిస్ 

దివంగత  వంగవీటి మోహన రంగా  తనయుడు, మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధాకృష్ణ కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన  వంగవీటి రాధాకృష్ణ ని  పవన్ కళ్యాణ్  ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.

IMG-20261014-WA0020.jpg

అనంతరం  రాధాకృష్ణ  తన అనుచరులను  పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని  పవన్ కళ్యాణ్  ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X