Tuesday, 20 October 2026
Header1
BREAKING

మహిళ స్వయం ఉపాధికి పలు కోర్సులు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 గుంటూరు
📅 ప్రచురణ: 10 Sep 2026, 05:25 PM
🔄 నవీకరణ: 12 Oct 2026, 05:09 AM
👁️ 216 views

గుంటూరు , సెప్టెంబర్ 10 : మహిళల స్వయం ఉపాధికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్ పర్సన్ పీతల సుజాత అన్నారు. గుంటూరులో గల మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయాన్ని గురువారం చైర్ పర్సన్ సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో వివిధ అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి, రక్షణకు పెద్ద పీట వేస్తుందని చెప్పారు. మహిళా సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని వివరించారు. 2026 - 27 ఆర్థిక సంవత్సరంలో మహిళా ఆర్థిక సంస్థ ద్వారా ఒక్కొక్క మహిళా ప్రాంగణానికి ఐదు శిక్షణా కార్యక్రమాలు చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పలు కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. కొన్ని శిక్షణా కార్యక్రమాలకు ఇంకా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉపయోగపడే ఫ్యాబ్రిక్ కట్టర్, సూయింగ్ మిషన్ ఆపరేటర్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ క్రెచ్ కేర్ టేకర్, వృద్ధుల, చిన్నపిల్లల కేర్ టేకర్ మొదలగు అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మహిళలు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఆదాయం పొంది ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయగలరని అన్నారు. వృత్తి విద్యతోపాటు మహిళల సౌకర్యార్థం ఉచిత నివాసంను శక్తి సదన్ లలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు బాల శ్రీ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X