Tuesday, 20 October 2026
Header1
BREAKING

దేవళమ్మ చెరువుకు మహర్దశ..!

- శాశ్వత తాగునీటి పరిష్కారమే ధ్యేయం..! - ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 10 Sep 2026, 05:32 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 234 views

మాచర్ల:  సెప్టెంబర్ 10 రాజధాని వాయిస్ :

పట్టణ పరిధిలోని దేవళమ్మ చెరువుకు మహర్దశ పట్టనున్నది. దాదాపు రూ. 6 కోట్ల 60 లక్షలతో చెరువు పునరుద్దరణకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడు దశాబ్ధాల కాలంలో కనివిని ఎరుగని రీతిలో చెరువులోని పూడికతీత పనులు, చెరువు కట్టల బలోపేతం, గ్రీనరి, వాకింగ్ ట్రాక్ వంటి పనులకు టెండర్లు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ త్వరలో పనులు ప్రారంభించనున్నది.

WhatsApp Image 2026-09-10 at 5.01.54 PM (1).jpeg

ఈ నేపథ్యంలో గురువారం దేవళమ్మ చెరువుకు తాగునీరు తీసుకొచ్చేందుకు అవసరమై డీపీఆర్ ను సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. లింగాపురం ప్రభుత్వ లే-అవుట్ వద్ద ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువను పరిశీలించారు. అక్కడి నుంచి గ్రావిటి ద్వారా తాగునీరును చెరువుకు మరలించేందుకు తగిన సాధ్యాసాధ్యాలను పర్యవేక్షించి, అధికారులకు తగు సూచనలు చేశారు. వివిధ శాఖల ద్వారా రావాల్సిన అనుమతులపై సమీక్షించారు. సమగ్ర తాగునీటి సరఫరాపై ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుని, పనులు ప్రారంభించారని ఎమ్మెల్యే జూలకంటి ఆధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, డీఈ రాములు నాయక్, ఏఈ రాఘవ, టీడీపీ నాయకులు కజ్జం సైదయ్య, కొమెర దుర్గారావు, మందలపు రామకృష్ణ, గట్ల కోటిరెడ్డి, సుభానీ తదితరులు ఉన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X