Tuesday, 20 October 2026
Header1
BREAKING

అపోహలు వీడి.. హెచ్‌ఐవీపై అవగాహన పెంచుకోవాలి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 01 Sep 2026, 05:12 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 10 views

చిలకలూరిపేట  సెప్టెంబర్ 01 రాజధాని వాయిస్ :

చిలకలూరిపేటలోని శ్రీ చైతన్య గార్ల్స్ జూనియర్ కాలేజీలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాంపు-పియు (క్యాంపు -పియు ) స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఐఈసీ (ఇన్ఫర్మేషన్ , ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ) అవగాహన కార్యక్రమం కాలేజీ ప్రిన్సిపాల్ కె. ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులకు హెచ్ఐవి గురించి, హెచ్ఐవి ఏయే మార్గాల ద్వారా సంక్రమిస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె. హనుమంత్ రావు మాట్లాడుతూ... హెచ్ఐవి/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత, చిన్నచూపు చూపకుండా వారిని సమాజంలో భాగంగా కలుపుకొని జీవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అదేవిధంగా హెచ్ఐవి/ఎయిడ్స్‌కు క్షయ వ్యాధితో ఉన్న సంబంధం, సుఖ వ్యాధులు తదితర అంశాలపై కూడా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. హెచ్ఐవి గురించి ఉన్న అపోహలను తొలగించి, సరైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయాల్సిన అవసరం ఉందని వివరించారు.

అనంతరం క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐఈసీ పాంప్లెట్‌లో ఉన్న సమాచారాన్ని విద్యార్థినులకు వివరించారు. పాంప్లెట్‌లో పొందుపరిచిన రిస్క్ అసెస్‌మెంట్ క్యూఆర్ కోడ్‌ గురించి కూడా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య గార్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినులతో పాటు క్యాంపు సంస్థ అవుట్‌రీచ్ వర్కర్ కె. పోలమ్మ పాల్గొన్నారు. విద్యార్థినులకు హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X