నరసరావుపేట. సెప్టెంబర్ 06
పల్నాడు జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, పాత నేరస్థులు, చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆయా పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని స్పష్టం చేశారు. ఎవరైనా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, నిరంతరం నిఘా కొనసాగుతుందని జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Be the first to share your thoughts on this story!