చిలకలూరిపేట సెప్టెంబర్ 07 రాజధాని వాయిస్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ ని యంత్రణ సంస్థ ఆదేశాల మేరకు 'ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయి న్ 2026'లో భాగంగా జిల్లాలో హెచ్ఐవి/ఎయిడ్స్ప ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేం దుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎల్ఈడి ప్రచార వాహనాన్ని ఏరియా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ dr అమృత వల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎల్ఈడీ వాహనం చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలలో 3 రోజులు పాటు ప్రధాన గ్రామాలు, రద్దీగా ఉండే ప్రాంతా ల్లో తిరుగుతూ ప్రజలకు హెచ్ఐవి నివారణ, నియంత్రణలపై పూర్తిస్థాయిలో చైతన్యం తీసుకువస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవిపై సరైన అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవి నిర్దారణ పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొ న్నారు. హెచ్ఐవి బారిన పడిన వారు నిరాశ చెందకుండా, ప్రభు త్వం ఉచితంగా అందించే ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా వాడి ఆరోగ్యంగా జీవించాలని సూ చించారు.ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె హనుమంత్ రావు గారు, ల్యాబ్ టెక్నీషియన్ వంశీ గారు, మరియు క్యాంపు సంస్థ మేనేజర్ కె. పవన్ కళ్యాణ్ గారు మరియు ఏఎన్ఏం ఊహ, శివ క్యాంపు సిబ్బంది, ఏఆర్ టి సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!