Tuesday, 20 October 2026
Header1
BREAKING

జల ప్రదాతలుగా లావు,జూలకంటి జోడి..!

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 11 Sep 2026, 05:55 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 15 views
Story Highlights
  • సువర్ణ అక్షరాలతో లిఖించేలా చరిత్ర సృష్టి ..!
  • రూ.4 వేల కోట్లతో సాగు,తాగు నీటి ప్రాజెక్టులు..!
  • మాచర్లలో మారుతున్న ప్రజల తలరాతలు..!

మాచర్ల సెప్టెంబర్ 11 రాజధాని వాయిస్ :    "ఎగువ పల్నాడు మొత్తం ఎటు చూసినా బీడులను తలపించే నెర్రెలిచ్చిన భూములు, దప్పికైతే ఆకాశంవైపు, ప్రభుత్వం అందించే వాటర్ ట్యాంకుల వైపు ఆశగా ఎదరుచూసే కళ్లు.. మాచర్ల నియోజకవర్గ ప్రాంత దుర్బర పరిస్ధితికి అద్దంపడుతోంది ”..! కూటమి ప్రభుత్వ రాకతో అటువంటి దయనీయ స్ధితి నుంచి భావి తరాల భవిష్యత్తు తలరాతలు మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ వాటర్ మ్యాన్ గా జాతీయ స్ధాయిలో ముద్రవేసుకున్న విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సారధ్యంలో ఏడు దశాబ్దాలుగా పడకేసిన తాగు, సాగు నీటి ప్రాజెక్టులు రెండేళ్ల కాలంలో పరుగులు పెడుతున్నాయి.

WhatsApp Image 2026-09-11 at 4.55.19 PM.jpeg

సువర్ణ అక్షరాలతో లిఖించే చెరగని చరిత్ర..!

మాచర్ల నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాగు, సాగు నీటి ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు, నిధుల తీసుకురావడం, కేటాయింపుల్లో జాప్యం లేకుండా వేగవంతం, పారదర్శకమైన పనుల పర్యవేక్షణ, అవినీతి రహిత కాంట్రాక్ట్ పనులు వంటివి ఒక క్రమ పద్దతిలో పట్టుకురావడంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి లు విజయం సాధించారు. ఫలితంగా నియోజకవర్గానికి వేల కోట్ల ప్రాజెక్టులు క్యూ కట్టాయి. ఈ ప్రాజెక్టులన్నీ ప్రజల వర్తమాన, భవిష్యత్తు అవసరాలను దిశానిర్ధేశం చేయనున్నాయి. ఏడు దశాబ్దాల కల.., కలగానే మిగిలిపోకుండా.. జీవం పోస్తూ.. వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నిన్న ( గురువారం ) ఏపీ సచివాలయం లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో వరికపూడిశెలకు చోటు లభించడం ప్రాజెక్ట్ నిర్మాణ అవసరతా అంచనాలను మరింతగా పెంచాయి..! ప్రాధమికంగా జరగాల్సిన పనులపై ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు యంత్రాంగానికి నిర్ణీత సమయం నిర్ధేశించారు. దీంతో.., ఇక వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్ధాపనతో పనిలేదు.., ప్రారంభోత్సవం డేట్ ఫిక్స్ చేయండి అన్న రీతిగా పనులు చకచక సాగేలా డైరెక్షన్ రానే వచ్చిందన్న ఆశాభావంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక అంచనకు వచ్చారు.

WhatsApp Image 2026-09-11 at 4.57.06 PM.jpeg

రూ.4 వేల 200 కోట్లతో సాగు,తాగు నీటి ప్రాజెక్టులు..!

వెల్దుర్తి మండలం, దమ్మర్లగొంది వద్ద వరికపూడిశెల ఎత్తిపోత ప్రాజెక్టు నిర్మాణం జరిగితే.., ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఎదర్కొనే సాగు, తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చునని కోస్లా కమిటి 1950లో నివేదిక ఇచ్చింది. తరువాత 2019, ఫిబ్రవరి నెలలో ప్రాజెక్టు రూ. 340.26 కోట్ల అంచనా నిధులతో ఫస్ట్ ఫేజ్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. కానీ, తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఫారెస్ట్ క్లియరెన్స్ కు రూ. 14.05 కోట్లు, పైపులైన్ నెట్ వర్క్ కు అవసమైన భూ సేకరణకు రూ. 63.14 కోట్ల నిధులను విడుదల చేసింది. మరోవైపు ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వస్తున్న వినతులు మేరకు మొదటి ఫేజ్ లోనే వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల పరిధిలోని దాదాపు 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి అన్నీ అనుమతులతో పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టుకు కీలకమైన పర్యావరణ అనుమతులు, చట్టబద్దమైన క్లియరెన్సులు, ప్రజాభిప్రాయ సేకరణ వేగవంతం చేసి.., సమగ్ర నివేదికలను వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. అన్నీ అనుమతులతో సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్ట్, ముందస్తు సాధ్యాసాధ్యత నివేదిక సిద్దమైతే దాదాపు డిసెంబర్ నెలలో రూ.3 వేల 227 కోట్ల నిధులతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. మరోవైపు నిమోజకవర్గంలో ఇప్పటికే గ్రామీణ తాగునీటి అవసరాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా రూ. 800 కోట్లు, మాచర్ల పట్టణానికి అమృత్ స్కీం ద్వారా రూ. 153.47 కోట్లు, రెండెళ్ళ తాగునీటి ఖర్చు చేసిన వేయం కలిపి మొత్తంగా దాదాపు రూ. 1000 కోట్లకు పైగా ప్రభుత్వ ఖర్చు చేస్తోంది.

WhatsApp Image 2026-09-11 at 4.55.18 PM.jpeg


మాచర్లలో మారుతున్న ప్రజల తలరాతలు..   మాచర్ల నియోజకవర్గంలో దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోని అన్నీ రంగాలు కూటమి ప్రభుత్వంలో గాడినపడుతున్నాయి. మౌలిక వసతులు, సదుపాయాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు తాగు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఉపాధి రంగం కూడా పుంజుకునేందుకు దాదాపు 500 ఎకరాల్లో వెల్దుర్తి మండలం, పట్లవీడు వద్ద మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. దీంతో పారిశ్రామికంగా నియోజకవర్గం బలమైన పునాదులు వేసుకుంటుంది. పల్నాడులో అత్యంత వెనుకబడి ప్రాంతాల్లో మాచర్ల నియోజకర్గంలో వస్తున్న, రాబోతున్న ప్రాజెక్టులన్నీ ప్రజల భవిష్యత్తు తలరాతలు మార్చడంలో ఎటివంటి అతిశయోక్తి లేదన్నది అక్షర సత్యం..!

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X