మంగళగిరి. అక్టోబర్ 13
రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి ప్రచార కార్యాచరణపై విస్తృతంగా చర్చించి, అనంతరం కమిటీ సభ్యులకు విధివిధానాల పత్రాలను అందజేశారు.
ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పి.వి.ఆర్. ప్రశాంత్, యనమల భాస్కర్, లాజిస్టిక్స్ అండ్ ఆపరేషన్స్ కమిటీ సభ్యుడు కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!