*స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమర సన్నద్ధం*
గురజాల.సెప్టెంబర్ 12,రాజధాని వాయిస్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో సన్నద్ధమవుతోంది, ఇందులో భాగంగా గురజాల–దాచేపల్లి సెంటర్‌లోని ఫంక్షన్ హాల్‌లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నరసరావుపేట పార్లమెంటరీ కోఆర్డినేషన్ టీం సభ్యులు నర్సరావుపేట జనసేన ఇన్‌చార్జ్ , స్టేట్ సెక్రటరీ సయ్యద్ జిలాని, ఏపీఆర్‌డీసీ డైరెక్టర్ శ్రీ వీరవల్లి వంశీ, ఏపీ నాటక రంగ అకాడమీ డైరెక్టర్ శివపార్వతి, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్,ఐటీ కోఆర్డినేటర్ మునగ వెంకట్, జిల్లా కార్యదర్శిలు బడిదల శ్రీనివాసరావు,అంబటి మల్లి, దూదేకుల కాసిం సైదా, మండల అధ్యక్షులు, పాముల కిషోర్, ఉప్పిడి నరసింహారావు, దాచేపల్లి టౌన్ అధ్యక్షుడు వెచ్చాల రవి, సీనియర్ నాయకులు తోట నాగేశ్వరరావు,కౌన్సిలర్లు అంబటి స్వామి, చింతకాయల కళ్యాణ్,సీనియర్ నాయకులు, కురసాల ప్రసాద్, దూదేకుల సలీం, బేతంచర్ల ప్రసాద్, కామిశెట్టి అమలింగేశ్వర రావు, గుర్రం కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం,నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయంతో పనిచేయడం, ఎన్నికల కార్యాచరణ, సోషల్ మీడియానుబాధ్యతాయుతంగా వినియోగించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి జనసైనికుడు ఐక్యంగా, సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Be the first to share your thoughts on this story!