శ్యామరాజుపురంలో ఎమ్మెల్యే జూలకంటి సమక్షంలో చేరిన 10 వైసీపీ కుటుంబాలు
దుర్గి:
కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న సమగ్ర అభివృద్ధి, అందుతున్న సంక్షేమానికి ఆకర్షితులై వైఎస్సార్సీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దుర్గి మండల పరిధిలోని శ్యామరాజుపురం గ్రామంలో గురువారం పర్యటించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన 10 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. నూతనంగా పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే జూలకంటి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న ప్రగతి ప్రస్థానాన్ని, సంక్షేమ పథకాల తీరును చూసే గ్రామాల్లో స్వచ్ఛందంగా చేరికలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు, లింగా బ్రహ్మయ్య, జానికిరామయ్య, యాగంటి నరేష్, సింగు నాగేశ్వరరావు తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!