సెప్టెంబర్ 14
రాజధాని వాయిస్ :
పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) రోహిత్ కుమార్ చౌదరి దంపతులు మరియు పోలీసు అధికారులు భక్తిశ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోయి, అందరికీ సుఖశాంతులు కలగాలని ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఆకాంక్షించారు. పోలీసు కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందిస్తూ సాగిన ఈ వేడుకల్లో ఎస్బి సీఐ ఎస్. ఆటోని రాజు, ఆర్ఐలు కృష్ణ, గోపీనాథ్, రాజు, యువరాజులతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Be the first to share your thoughts on this story!