మాచర్ల, సెప్టెంబర్ 26 రాజధాని వాయిస్ :
మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.8వ వార్డు ఇన్చార్జ్ కజ్జం సైదయ్య, వార్డు అధ్యక్షులు మద్దిగపు శ్రీనివాసరెడ్డి (బుల్లిరెడ్డి), ఉపాధ్యక్షులు వంకాయలపాటి నరేష్ కుమార్, 67వ బూత్ ఇన్చార్జ్ వంకాయలపాటి రాజీవ్ కుమార్ పాల్గొని వార్డులోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!