Tuesday, 20 October 2026
Header1
BREAKING

తీరు మార్చుకోకుంటే మీ సంగతి తేలుస్తాం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 06 Oct 2026, 04:51 PM
🔄 నవీకరణ: 10 Oct 2026, 01:23 PM
👁️ 1 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

జగన్ కు, వైసీపీ నాయకులకు మంత్రి సవిత హెచ్చరిక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు ఓర్వలేక పోతున్న జగన్ సొంత పార్టీ నాయకులనే పొట్టన పెట్టుకునె సంస్కృతి గొడ్డలి పార్టీది శాంతి భద్రతల విఘాతానికి, అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోనున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో సాంతం నిధులతో పేదల కడుపు నింపుతున్నాను... గతంలో పెనుకొండలో సొంత నిధులతో వెయ్యి రోజుల పాటు అన్న క్యాంటీన్ నిర్వహించా... ఇపుడు గోరంట్లలో పేదల కడుపు నింపుతున్నాను : మంత్రి సవిత గోరంట్లలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుతో కలిసి మంత్రి సవిత గజ మాలలతో ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు

గోరంట్ల/ శ్రీ సత్యసాయి : రాజధాని వాయిస్ 

 'రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అభివృద్ధిని అడ్డుకున్నా చూస్తూ ఊరుకోబోమని సరైన సమయంలో మీ సంగతి తేలుస్తామని' జగన్ కు, వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడు గుర్రాల్లా కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి, సీఎం చంద్రబాబు పేదల కడుపు నింపుతున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో గతంలో పెనుకొండలో, ఇప్పుడు గోరంట్ల లో కేంద్రంలో తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కేంద్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుతో కలిసి మంత్రి సవిత అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు‌. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానుద్దేశించి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పేదలు, కార్మికులకు రూ.5లకే రుచికరమైన, నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించాలన్న లక్ష్యంతో 2018లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు పేదల కడుపు నింపితే, తరవాత వచ్చిన జగన్ వారి పొట్ట కొట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు, ప్రభుత్వ పథకాలకు తన పేరు,శతన తండ్రి పేరు పెట్టుకున్న జగన్... అన్న క్యాంటీన్లకు కూడా తనకు నచ్చిన పేరు పెట్టుకొని నడిపించాల్సిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. వాటి ద్వారా కోట్లాది మంది రూ.5లకే తమ కడుపు నింపుకుంటున్నారన్నారు.

WhatsApp Image 2026-10-06 at 4.38.01 PM.jpeg

సొంత నిధులతో పేదల కడుపు నింపుతున్నా...

2019 తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ అన్న క్యాంటీన్లు నిలిపివేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సూచనల మేరకు పెనుకొండ పట్టణం లో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశామన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ అన్న క్యాంటీన్ ను అడ్డుకోవాలని కుట్ర పన్నిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పెనుకొండలో అన్న క్యాంటీన్ మూయలేదన్నారు. రోజుకు 400 మంది చొప్పున వెయ్యి రోజుల పాటు అన్న క్యాంటీన్ ను నిర్వహించానన్నారు. ఇప్పుడు గోరంట్లలో పేదలకు కడుపు నింపాలన్న ఉద్దేశంతో సొంత నిధులతో అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

WhatsApp Image 2026-10-06 at 4.38.01 PM (1).jpeg

తీరు మార్చుకోకుంటే ఖబడ్దార్ జగన్

సూపర్ సిక్స్ సహా ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత తెలిపారు. ముఖ్యంగా రాయలసీమను అన్ని రంగాల్లో ముందు నిలిపేలా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై జగన్ గాని, గొడ్డలి పార్టీ నాయకులు గాని చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అభివృద్ధిని అడ్డుకున్నా చూస్తూ ఊరుకోబోమని ఖబడ్దార్ అని హెచ్చరించారు. సరైన సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ జగన్, గొడ్డలి పార్టీ నాయకుల సంగతి తేలుస్తారని స్పష్టం చేశారు‌. సొంత పార్టీ కార్యకర్తలను, నాయకులను పొట్టనపెట్టుకున్న పార్టీ గొడ్డలి పార్టీ సంస్కృతి అని మంత్రి సవిత మండిపడ్డారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ, పెనుకొండ అన్నపూర్ణగా మంత్రి సవిత పేరుగాంచారని కొనియాడారు.

అంతకుముందు అన్న క్యాంటీన్ ప్రారంభానికి విచ్చేసిన మంత్రి సవితకు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గోరంట్ల బస్టాండ్ నుంచి అన్న క్యాంటీన్ వరకూ సాగిన రెండు కిలోమీటర్ల ర్యాలీలో మంత్రి సవితకు, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు గజ మాలలతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, పలువురు డైరెక్టర్లు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X