నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలి
జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర కౌన్సిలింగ్
నరసరావుపేట.
రాజధాని వాయిస్ :
పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల కట్టడికి జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులను స్టేషన్లకు రప్పించి అధికారులు తీవ్రస్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులు ఇకనైనా చెడు నడవడిక, నేర ప్రవృత్తిని పూర్తిగా విడనాడి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని తేల్చిచెప్పారు. ఎవరైనా తిరిగి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా సహించే ప్రసక్తే లేదని, వారిపై పీడీ యాక్ట్ సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయం వర్గాలు ఆదివారం ఈ వివరాలను వెల్లడించాయి.
Be the first to share your thoughts on this story!