నరసరావుపేట. సెప్టెంబర్ 06
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి ఆర్ జి ఎస్)కు అర్జీలు సమర్పించేందుకు వచ్చే బాధితులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హెచ్చరించారు. నరసరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అర్జీలు రాసిస్తామంటూ కొందరు వ్యక్తులు బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.
అర్జీదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోనే సిబ్బంది ఆధ్వర్యంలో ఉచితంగా అర్జీలు రాసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరిస్తామని లేదా అర్జీలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవాలని అదనపు ఎస్పీ కోరారు.
Be the first to share your thoughts on this story!