Tuesday, 20 October 2026
Header1
BREAKING

విగ్రహాలను నిర్దేశించిన ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 గుంటూరు
📅 ప్రచురణ: 09 Sep 2026, 05:25 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 217 views

గుంటూరు, సెప్టెంబర్ 9 : విగ్రహాలను నిర్ణయించిన నిర్దేశిత ప్రత్యేక నిమజ్జన ప్రదేశాల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ  పిలుపునిచ్చారు. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని పాటించి పర్యావరణ హితానికి తోడ్పాటును అందించాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు.

సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాలను జలాశయాలు, నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం జరుగుతుందని, తద్వారా నీటి నాణ్యత దెబ్బతింటుండటం ఆందోళనకరమైన అంశంగా ఉందన్నారు. క్లాస్-1 నగరాల పరిధిలో నీటి వనరుల నీటి నాణ్యతను మూడు దశల్లో - నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరుగుతున్న సమయంలో, నిమజ్జనం అనంతరం పర్యవేక్షించి అంచనా వేయాలని సూచించడం జరిగిందని వివరించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల్లో ముఖ్యంగా పర్యావరణహిత విగ్రహాలను ఉపయోగించాలన్నారు. రంగులు వినియోగిస్తే పర్యావరణ హిత
రంగులు మాత్రమే వినియోగించాలని అన్నారు. అవసరమైన సౌకర్యాలతో తాత్కాలికంగా ప్రత్యేక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. వినాయక మండపాలు నిర్వహించే వర్గాలతో సహా ప్రజలకు
విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా నీటి నాణ్యత దెబ్బతినకుండా నివారించుటకు సి.పి.సి.బి మార్గదర్శకాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X