Tuesday, 20 October 2026
Header1
BREAKING

వైసీపీ అరాచకాన్ని క్షమించను..!

- ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా సమగ్రాభివృద్ధి..! -ఎమ్మెల్యే జూలకంటి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 27 Sep 2026, 05:04 PM
🔄 నవీకరణ: 18 Oct 2026, 12:40 PM
👁️ 113 views


మాచర్ల : సెప్టెంబర్ 27 రాజధాని వాయిస్ :

నియోజకవర్గంలో వైసిపి అరాచకాన్ని క్షమించేదే లేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తేల్చి చెప్పారు. ఆదివారం మండల పరిధిలోని ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద జల్ జీవన్ మిషన్ నిధులతో రాయవరం జంక్షన్ నుంచి కారంపూడి వరకు నిర్మిస్తున్న పల్నాడు గ్రిడ్ వాటర్ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలతో శంకుస్థాపన చేశారు.

WhatsApp Image 2026-09-27 at 4.48.02 PM (1).jpeg
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.., ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, అందిస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకొస్తున్న పెట్టుబడులను చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు అరాచకానికా..? అభివృద్ధికా..?అని ప్రజలను అడిగితే కూటమి పార్టీలకే తమ మద్దతు అంటూ ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు. జల్ జీవన్ మిషన్ తో నియోజకవర్గ వ్యాప్తంగా మంచినీరు, వరికపూడిశెల నిర్మాణంతో రైతులందరికీ సాగునీరు కచ్చితంగా అందిస్తామని భీమా వ్యక్తం చేశారు.
WhatsApp Image 2026-09-27 at 4.48.03 PM.jpeg
రూ. 36 వేల కోట్లతో 36 ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టుల జాబితాలో వరికపూడిశెల ప్రాజెక్టుకు చోటు లభించడం గర్వంగా ఉందన్నారు. వచ్చే ఏడాది నాటికి నియోజకవర్గంలో సాగు,తాగు నీరు పుష్కలంగా అందుతుందని జోష్యం చెప్పారు. అలానే మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణకు సమర్థవంతమైన చర్యలు చేపడుతున్నావని పేర్కొన్నారు. పట్టణ విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యతలను పిపి మోడ్ లో ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నామని.., ఇకపై నిరాటంక విద్యుత్ సరఫరా నిర్వహణ జరుగుతుందన్నారు.
WhatsApp Image 2026-09-27 at 4.48.06 PM.jpeg
జోడెద్దుల్లా అభివృద్ధి,సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెడుతుంటే.., అది చూస్తున్న జగన్ రెడ్డికి జ్వరం భయం పట్టుకుందని విమర్శించారు. మెగా డీఎస్సీ పై బురద రాజకీయాలు చేస్తూ.., ఉపాధ్యాయులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంటే నాయకుడి అభివృద్ధి కాదని, ప్రాంతాల అభివృద్ధి చెందితేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కజ్జం సైదయ్య, కొమెర దుర్గారావు, కూనిశెట్టి వెంకటేశ్వర్లు, కూనిశెట్టి రామకృష్ణ, వజ్రం నాయక్,బృంగ శ్రీను, వేణు  NCC ప్రాజెక్టు మేనేజర్ మహేంద్ర, సీనియర్ ఇంజనీర్ రాంబాబు, ఇంజనీర్లు కిరణ్, సురేష్  తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X