Tuesday, 20 October 2026
Header1
BREAKING

మానవత్వం చాటుకున్న కామినేని సైదయ్య బాలబోయిన హనుమంతరావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 03 Oct 2026, 10:08 PM
🔄 నవీకరణ: 08 Oct 2026, 10:31 PM
👁️ 637 views

వెల్దుర్తి.

అక్టోబర్ 03
రాజధాని వాయిస్ :

మండలంలోని మండాది, పట్లవీడు, యర్రబాలెం, ముటుకూరు వెళ్ళే రహదారి. నెల క్రితం మిషన్ భగీరధ కార్యక్రమంలో భాగంగా వాటర్ పైపులు కోసం తారు రోడ్డు మీద తవ్వి పైపులు వేయటం జరిగింది. సరిగ్గా పూడ్చకపోవటంతో పైపులు కోసం తవ్విన చోటు పెద్ద గాడి ఏర్పడింది. దీంతో ఈ రూట్లో తిరిగే ఆర్టీసీ బస్సు వారు, స్కూల్ బస్సుల వారు, ద్విచక్ర వాహనదారులు, ఆటో వారు, ట్రాక్టర్ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలు చూడలేని యర్రబాలెం గ్రామానికి చెందిన కామినేని చిన్న సైదయ్య, జనసముద్రంన్యూస్ మాచర్ల నియోజకవర్గం ఇన్చార్జి, జర్నలిస్ట్ బాలబోయిన హనుమంతరావు ఇద్దరూ కలిసి మానవత్వంతో కష్టపడి రోడ్డు మీద గాడిని శనివారం పూడ్చి వేశారు. దీంతో ఆ రూట్లో తిరిగే ఆర్టీసీ బస్ డ్రైవర్ బండారు రాంబాబు, పలువురు ద్విచక్ర వాహనదారులు మంచి పని చేశారయ్యా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2 Comments

+ Leave a Comment
Anand Aleti Oct 04, 2026 · 10:42 AM
Good Job Sir☺️☺️
Anand Aleti Oct 04, 2026 · 12:05 PM
Good Job Sir ☺️☺️
Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X