చిలకలూరిపేట.
సెప్టెంబర్ 02
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమాలు నిర్వహించారు.
ముందుగా మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తదనంతరం గుర్రలచావిడి, తూర్పు మాలపల్లి, సుభానీ నగర్, పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు, సుగాలి కాలనీలలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహాలకు విడదల రజిని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్ అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, మహిళలు, విద్యార్థులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం వైయస్ఆర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం జీవించిన మహానేత వైయస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
అనంతరం ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానేత వైయస్ఆర్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ పేదలకు, నిరుపేదలకు అండగా నిలవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత వైయస్ఆర్కు ఘన నివాళులు అర్పించారు.
Be the first to share your thoughts on this story!