Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఘనంగా శ్రీ లక్ష్మీ వినాయక ఉత్సవాలు: టీడీపీ నాయకుల పూజలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 14 Sep 2026, 03:23 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 3 views

మాచర్ల: సెప్టెంబర్ 14 రాజధాని వాయిస్ :
పట్టణంలోని 10వ వార్డు, పాత రైలు కట్ట (68వ బూత్) పరిధిలో శ్రీ లక్ష్మి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని తెలుగుదేశం పార్టీ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ సీనియర్ నాయకులు కజ్జం సైదయ్య, యువ నాయకులు ఖమ్మంపాటి అనిల్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయకుడి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు 68వ బూత్ ఇంచార్జ్ షేక్ జానీ బాషా, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X