Tuesday, 20 October 2026
Header1
BREAKING

ఘనంగా జనాకర్షణ దినపత్రిక ఆవిష్కరణ...

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 09:30 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 6 views
ఆవిష్కరించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

దాచేపల్లి. సెప్టెంబర్ 04

పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో 'జనాకర్షణ' తెలుగు దినపత్రిక ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పత్రిక ప్రతులను లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సమాజ హితమే ధ్యేయంగా, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక భూమిక పోషించాలని పేర్కొన్నారు. నిఖార్సయిన వాస్తవాలు, పక్కా నిజ నిర్ధారణతో కూడిన వార్తలతో ప్రజల విశ్వసనీయతను చూరగొంటూ పత్రిక విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనాకర్షణ పత్రిక ఎడిటర్ కురియాల ఉదయభాస్కర్, అక్షర కృష్ణ ఎడిటర్ పగడాల నాగేశ్వరరావు, జిల్లా బ్యూరో ఖమ్మంపాటి సాంబశివరావులతో పాటు పత్రిక నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లు, ఇన్-ఛార్జీలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X