ఆక్స్ఫర్డ్ వెంచర్ సూర్య అపార్ట్మెంట్లో ఘనంగా అమ్మవారి ఊరేగింపు
పిడుగురాళ్ల.రాజధాని వాయిస్:
ఆక్స్‌ఫర్డ్ వెంచర్ సూర్య అపార్ట్‌మెంట్‌లో దసరా నవరాత్రుల ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కమిటీ సభ్యులు చితిరాల శ్రీనివాసరావు, బొడ్డపాటి హనీమిరెడ్డి,గుత్తికొండ హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఊరేగింపులో భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. నవరాత్రుల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Be the first to share your thoughts on this story!