Tuesday, 20 October 2026
Header1
BREAKING

మంత్రి నారా లోకేష్ సంకల్పానికి గణనాధుని ఆశీస్సులు:డాక్టర్.ఎం.రమేష్ రావు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 19 Sep 2026, 08:18 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 110 views

*నారా లోకేష్ సంకల్పానికి గణనాధుని ఆశీస్సులు!*

-డా.యం.ఉమేష్ రావు,రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
*శ్రీకాళహస్తి*

రాజధాని వాయిస్:

తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల చేత మన్ననలు పొందుతూ, నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కొరకు, యువ శక్తి బలోపేతం కావడానికి తగిన ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తీవ్రంగా శ్రమిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంకల్పానికి గణనాధుని ఆశీస్సులు మెండుగా ఉండాలని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు ప్రార్థించారు.
*గణేష్ ఉత్సవాల స్పూర్తిని గౌరవిస్తూ*
భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత కీలక పాత్రను పోషించిన గణేష్ ఉత్సవాలు స్పూర్తివంతమైన మరియు చిరస్మరణీయమైన ఘట్టాలుగా పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడంతో పాటు, ఇతర శాఖల నుండి పొందవలసిన అనుమతులను ఏకగవాక్ష పద్దతిలో ఇప్పించేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించిన నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇచ్చిన మాట నెరవేర్చడానికి విఘ్ననాయకుని ఆశీస్సులు కోరుతూ!
కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఐదేళ్ళ వ్యవధిలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు తీవ్రంగా కృషి చేస్తూనే, ప్రభుత్వ శాఖలలో ఉన్న సుమారు వెయ్యి గ్రూప్ I ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్‌ ప్రకటించి, భర్తీ ప్రక్రియను పకడ్బందీగా ఆచరణలో పెడుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి, ఉద్యోగాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కి కావలసిన శక్తియుక్తులను అందించమని దేవుడిని ప్రార్థించారు. ఇప్పటికే మెగా డియస్సీ ద్వారా సుమారు పదహారు వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయగా, మిగిలిన పాలనాకాలంలో మరో పద్నాలుగు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, మొత్తంగా ఐదేళ్ళ వ్యవధిలో ముప్పై వేల టీచర్ పోస్టులను, పోలీసు శాఖలో ఉన్న వివిధ విభాగాలలో రెండు వేలకు పైగా భర్తీ చేసే లక్ష్యాన్ని ఛేదించడానికి నారా లోకేష్ కి తగిన శక్తిని అందించి, అండగా నిలవమని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
ఉద్యోగాల కల్పనలో ఆటంకాలు లేకుండా చూడమని ప్రార్థిస్తూ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సియం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం కూడలిలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్స్‌ప్రెస్ వేగంతో ముందుకు వెళుతూ, లక్షలాది మంది యువ జనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, దీనికి పియం నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ఎంతో మేలు చేస్తున్నదని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సియం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి శక్తవంచన లేకుండా కృషి చేస్తున్నదని కొనియాడారు.
*యువ శక్తిని నిర్వీర్యం చేయడమే జగన్ లక్ష్యమా ?*
స్వయం ఉపాధి ఆలోచనలను, సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా యువ తరాన్ని దేశ ప్రగతికి ఉపయోగించుకునేలా ఆలోచనలు చేయాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కానీ, జగన్ రెడ్డి మాత్రం యువతకు తగిన ఉపాధి అవకాశాలు లేకుండా చేసి, వారివారి అర్హతలు మరియు నైపుణ్యాలను బట్టి వారికి దక్కవలసిన ఉద్యోగాల కల్పనను పక్కనపెట్టి, వారిని వాలంటీర్లుగా,సేల్స్ మెన్,గంజాయి విక్రేతలుగా మారిపోయేలా చేసి వారిని బానిసత్వం లోకి తీసుకెళ్ళాడని, యువశక్తిని నిర్వీర్యం చేయడమే తన ఏకైక లక్ష్యంగా జగన్ పాలనను కొనసాగించాడని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్,బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, బిజెపి నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X