Tuesday, 20 October 2026
Header1
BREAKING

గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు 2026 గ్రహీత షేక్.ఫిరోజ్ బాషా

పల్నాడు ఉత్తమ అవార్డు గ్రహీతకు గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 13 Sep 2026, 07:32 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 117 views

'గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డు 2026' అందుకున్న తుమ్మలచెరువు ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా:

గుంటూరు.సెప్టెంబర్ 13,రాజధాని వాయిస్:

గుంటూరు జిఎంసిఏఎన్ఏ ఆడిటోరియంలో సెప్టెంబర్ 13న టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ ఐకానిక్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026 వేడుకల్లో పిడుగురాళ్ల మండలం ఎంపిపిఎస్ మెయిన్ తుమ్మలచెరువు ఉపాధ్యాయులు షేక్ ఫిరోజ్ బాషాకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విద్యా బోధనలో నిరంతరం శ్రమిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నందుకు గాను ఈ పురస్కారం లభించింది.

ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జయహో జనార్ధన్ సినిమా బృందంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు హాజరయ్యారు.అవార్డు గ్రహీత షేక్ ఫిరోజ్ బాషాను పిడుగురాళ్ల మండల విద్యాధికారులు, తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.ఇటీవల షేక్ ఫిరోజ్ బాషా 'పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు 2026' అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X