Tuesday, 20 October 2026
Header1
BREAKING

నేర ప్రవృత్తి వీడండి...సత్ప్రవర్తనతో జీవించండి..

- రౌడీషీటర్లకు పల్నాడు పోలీసుల హెచ్చరిక

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 20 Sep 2026, 05:31 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 205 views

నరసరావుపేట.

రాజధాని వాయిస్:

పల్నాడు (ఆంధ్రప్రదేశ్):
జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం చర్యలు ముమ్మరం చేసింది. జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసు అధికారులు ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
WhatsApp Image 2026-09-20 at 5.24.22 PM.jpeg

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, సమాజంలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా తిరిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా లేదా అసాంఘిక పనులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X